AP: బెస్ట్ టూరిజం ప్లేస్ విశాఖ

అమరావతి (CLiC2NEWS): ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక రంగానికి రెండు అవార్డుల వరించాయి. ఎపిలోని విశాఖకు బెస్ట్ టూరిజం ప్లేస్ అవార్డు వచ్చింది. ఎపి పాలసీకి బెస్ట్ టూరిజం పాలసీ అవార్డు లభించింది. ఈ అవార్డులను టూరిజం ట్రావెల్ అసోసియేషన్ ప్రకటించినట్లు ఎపి పర్యాటక శాఖ ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు.