ఉగాది నుండి పి-4 ప్రారంభం: సిఎం చంద్రబాబు
మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం

అమరావతి (CLiC2NEWS): తెలుగు సంవత్సరాది (ఉగాది) సందర్భంగా పి-4 విధానాన్ని ప్రారంభించనున్నట్లు సిఎం చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రబుత్వ పథకాలకు ఎలాంటి సంబంధం ఉండదు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని.. సంపన్నులు-పేదలను ఒకే చోటకు చేర్చడమే లక్ష్యంగా పి-4 రూపొందంచబడినదని సిఎం తెలియజేశారు. ఈ విధానంపై సిఎం సమీక్ష నిర్వహించారు.
2029 నాటికి పేదరికాన్ని నిర్మూలించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని సిఎం అన్నారు. ఈ విధానం అమలులో భాగస్వాములు కావడానికి ఎన్నారైలతో సహా ఎవరైనా స్వచ్చందంగా ముందుకు రావొచ్చన్నారు. . దీని అమలు ప్రక్రియలో అండగా నిలిచేవారిని మార్గదర్శిగా, లబ్ధి పొందే వారిని బాంగారు కుటుంబాలుగా వ్యవహరిస్తామని ఆయన వెల్లడించారు. పి-4 అమలులో భాగంగా ముందుగా గ్రామ, వార్డు సభల ద్వారా లబ్ధిపొందే కుటుంబాల జాబితా రూపొందిస్తారని సిఎం తెలిపారు. మొదటి దశలో 20లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని ఆయన తెలిపారు
సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10శాతం మంది.. పేదరికంలో ఉన్న 20శాతం మంది పేదలను దత్తత తీసుకుంటే పేదరికం నిర్మూలించబదుతుందనే నేపథ్యంలో ఈ పి-4రూపకల్పన జరిగినట్లు సమాచారం. తెలుగు వాళ్లు దేశ విదేశాల్లో మంచి స్థానాల్లో స్థిరపడ్డారని.. అత్యధిక తలసరి ఆదాయం సాధించి తెలుగు ప్రజలు గ్లోబల్ సిటిజన్స్‌గా తమ సత్తా చాటుతున్నారు. పేదరిక నిర్మూలన కోసం అందరూ భాగస్వాములు కావాలని సిఎం ఇటీవల పిలుపునిచ్చారు.