AP Corona: కొత్తగా 17,188 కేసులు.. 73 మంది మృతి

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,00,424 కరోనా పరీక్షలు చేయగా, 17,188 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్ర‌వారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో 12,45,374 మంది వైరస్‌ బారినపడ్డారు. తాజాగా రాష్ట్రంలో గత 24 గంటల్లో 73మంది ప్రాణాలను కోల్పోయారు.

జిల్లాల వారీగా మ‌ర‌ణాలు..
విజయనగరంలో 11మంది మృతి చెందగా, విశాఖ 10, తూర్పుగోదావరి 8, చిత్తూరు 7, కృష్ణా 6, గుంటూరు 6, కర్నూలు 5, ప్రకాశం 5, పశ్చిమగోదావరి 5, నెల్లూరు 4, శ్రీకాకుళం 4, అనంతపురంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన మరణాలతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 8,519 మృత్యువాతపడ్డారు.

తాజాగా 12,749మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం 10,50,160మంది కరోనా బారి నుండి కోలుకున్నారు.
ఏపీలో కరోనా కేసులు, తాజా పరిస్థితిపై శుక్రవారం ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్‌ సింఘాల్‌ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య పెంచామని ఆయన తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డులున్న వారికి ప్రైవేటు ఆస్పత్రులలో ఉచితంగా వైద్యం అందిస్తామని వివరించారు.

Leave A Reply

Your email address will not be published.