AP Corona: ఎపిలో 63 మంది మృతి

అమరావతి (CLiC2NEWS): ఎపిలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఎపిలో 74,435 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 11,434 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు ఎపిలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,54,875 కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 7,055 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు ఎపిలో మొత్తం 9,47,629 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 64 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,800 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 99,446 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.