AP: ‘సంపూర్ణ గృహ హక్కుప‌‌థ‌కం’ ఉగాది వ‌ర‌కు పొడిగింపు..

ప‌శ్చిమ‌గోదావ‌రి (CLiC2NEWS): ఎపి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ‘సంపూర్ణ గృహ హ‌క్కు ప‌థ‌కం’ గడువు వ‌చ్చే ఉగాది వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఎక్క‌వ‌మంది ల‌బ్ధి పొందాల‌నే ఉద్దేశ్యంతో ఈ ప‌థ‌కాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపారు. జ‌గ‌న‌న్న సంపూర్ణ గృహ హ‌క్కు ప‌థ‌కాన్ని సిఎం త‌ణుకులో లంఛ‌నంగా ప్రారంభించారు. ల‌బ్ధి దారుల‌కు గృహ‌హ‌క్కు ప‌త్రాల పంపిణిని ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈ ప‌థ‌కం ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 31ల‌క్ష‌ల మందికి ఇళ్ల ప‌ట్లాల‌ను పంపిణి చేశార‌ని, దాదాపు రూ.10వేల కోట్ల రుణ మాఫీ చేశామ‌ని తెలిపారు. రూ. 6వేల కోట్ల విలువ‌చేసే రిజిస్ట్రేష‌న్ , స్టాంప్ డ్యూటి ఛార్జీల మిన‌హాయింపు ఇచ్చామ‌ని తెలియ‌జేశారు.

మొద‌టి రోజు జిల్లావ్యాప్తంగా దాదాపు 25 వేల మందికి పత్రాలు పంపిణి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలిసారిగా సిఎం త‌ణుకు రావ‌డంతో భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేశారు. ప‌ట్ట‌ణంలో సుమారు రూ. 171.48 కోట్ల‌తో చేప‌ట్ట‌నున్న అభివృద్ధి ప‌నుల‌కు జ‌గ‌న్ శంకుస్థాప‌న చేశారు.

Leave A Reply

Your email address will not be published.