AP: ఇంటర్ సెకండియర్ ఫలితాలు
![](https://clic2news.com/wp-content/uploads/2021/03/adimulapu.jpg)
అమరావతి (CLiC2NEWS) : ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. కరోనా కారణంగా ఈ సంవత్సరం పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసినదే. ఈసందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. పదోతరగతిలో సాధించిన మార్కలకు 30%, ఇంటర్ మొడటి సంవత్సరానికి 70% వెయిటేజ్‌తో మార్కులను కేటాయించామని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫెయిల్ అయిన విద్యార్థులను కూడా పాస్ చేశామని తెలిపారు. విద్యార్థులు పరీక్ష ఫలితాలను ఈక్రింది వెబ్‌సైట్లలో పొందవచ్చు.
www.sakshieducation.com
www.examresults.ap.nic.in
www.results.bie.ap.gov.in
www.bie.ap.gov.in
www.results.apcfss.in