ఎపి మంత్రి ఎస్కార్ట్ వాహనం ఢీకొని ఒకరు మృతి

ప్రకాశం (CLiC2NEWS): ఎపి మంత్రి ఆదిమూలపు సురేష్ ఎస్కార్ట్ వాహనం ఆటోని ఢీట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. జిల్లాలోని త్రిపురాంతకం మండలం కేశినేని పల్లి వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సిఎం జగన్ పర్యటన నేపథ్యంలో మంత్రి విజయవాడ నుండి మార్కాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడిని త్రిపురాంతకం మనరాజుపాలెంకు చెందిన ఇజ్రాయిల్‌గా గుర్తించారు. ప్రమాద సమయంలో మంత్రి సురేష్ ముందు వాహనంలో ఉన్నట్లు సమాచారం.