ఎపిలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈఎపిసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పిజిఎల్‌సెట్, పిజిఈసెట్ , ఈసెట్, ఐసెట్ ప్రవేశ పరీక్షల తేదీలను ఎపి ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
పరీక్షల తేదీల వివరాలు
జులై 4 నుండి 12 వరకు ఈఎపిసెట్
జులై 13వ తేదీన ఎడ్‌సెట్, లాసెట్, పిజిఎల్‌సెట్
జులై 18 నుండి 21 వరకు పిజి ఈసెట్
జులై 22వ తేదీన ఈ సెట్
జులై 25 వ తేదీన ఐసెట్ నిర్వహించబడును.