AP: జెడ్పిటిసి, ఎంపిటిసి స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్

అమరావతి(CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో 10 జెడ్పిటిసి, 123 ఎంపిటిసి స్థానాలకు ఈరోజు (మంగళవారం) ఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ కారణాల వల్ల ఆగిపోయిన స్థానాలలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఓట్ల లెక్కింపు సమయంలో తడిసిపోయిన ఓట్లు వలన లెక్కింపు కొనసాగక పోవటంతో, కొన్నిచోట్ల గెలిచిన వారు చనిపోవటం వంటి కారణాల వలన రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు. వీటిలో 4 జడ్పిటిసి, 50 ఎంపిటిసి స్థానాలకు ఏకగ్రీవ ఎన్నిక జరిగిన సంగతి తెలిసినదే. రాష్ట్రంలో 954 పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా144 సెక్షన్ అమలు చేస్తున్నారు.