ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఐటీ, నైపుణ్యాభివద్ధి శిక్షణ మంత్రి గౌతమ్‌రెడ్డి విడుదల చేశారు. బుధవారం విడుదల చేసిన ఈ ఫలితాల్లో ఇద్దరికి మొదటి ర్యాంకు వచ్చింది. విశాఖటప్నంలోని విశాలక్ష్మినగర్కు చెందిన కల్లూరి రోషన్‌లాల్, పశ్చిమగోదావరి జిల్లా నల్లజెర్లకు చెందిన కొమరాపు వివేక్ వర్ధన్ కు మొదటి ర్యాంకు వచ్చింది. ఇక మూడో ర్యాంకును 9 మంది సాధించడం విశేషం .
ఈ సందర్భంగా మంత్రి గౌతమ్ రెడ్డి ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. జగనన్న విద్యాదీవెన ద్వారా 81వేల మంది విద్యార్థులకి రూ.128 కోట్లు అందజేశామని పేర్కొన్నారు. 72 వేల మంది విద్యార్థులకి రూ.54 కోట్లు జగనన్న వసతి దీవెనగా అందించామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ డైరెక్టర్ లావణ్యవేణి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ బంగారు రాజులు తదితరులు పాల్గొన్నారు.
- అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా శ్రీకాకుళం..
- అత్యధిక బాలికల ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా నెల్లూరు,,
- అత్యధిక బాలుర ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లా ప్రకాశం..