AP: 12 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపాలిటీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎపిలో మిగిలిన కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 533 పంచాయతీ వార్డులు, 85 ఎంపీటీసీలు, 11 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అన్ని స్థానిక సంస్థలకు నవంబరు 3వ తేదీ నుండి 5త తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. పంచాయితీలకు ఈనెల 14న పోలింగ్ జరుగుతుంది. అదేరోజు కౌంటింగ్ కూడా జరుగుతుంది. మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు 15న పోలింగ్ జరుగుతుంది. 17వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది.