AP: ఎటిఎంలో రూ.17 లక్షలు అపహరణ

కడప(CLiC2NEWS): నగరంలోని కెస్ఆర్ఎమ్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోని ఎస్‌బిఐ ఎటిఎం చోరీకి గురైంది. ఎటిఎంలోని నగదును దొంగలు అపహరించారు. గ్యాస్ కట్టర్‌తో కట్ చేసి ఎటిఎంలోని రూ. 17లక్షల నగదును చోరీ చేశారు. ఎటిఎం చోరీని గుర్తించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరిస్తున్నారు. బ్యాంక్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.