AP: ఇంద్రకీలాద్రిపై సరస్వతీ దేవిగా కనకదుర్గమ్మ

విజయవాడ (CLiC2NEWS) : ఆంధ్ర ప్రదేశ్లోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు మూలా నక్షత్రం కావున అమ్మవారు సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సరస్వతి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువగా తరలివస్తున్నారు. ఈరోజు అర్ధరాత్రి రెండున్నర గంటల నుండి భక్తుల దర్శనానికి అనుమతించారు. అంతరాలయం, ప్రత్యేక దర్శనం టిక్కెట్లు లేకుండా అందరికీ ఉచిత దర్శన అవకాశం కల్పించారు.