సాయితేజ కుటుంబానికి ఎపి సర్కార్ రూ.50 లక్షల ఆర్థిక సాయం

అమరావతి(CLiC2NEWS): ఆర్మీ హెలికాప్టర్ ఘటనలో మృతి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల సాయం ప్రకటించింది. సిడిఎస్ బిపిన్ రావత్‌కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేసిన సాయితేజ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసినదే. ఆయన మృతదేహాన్ని ఎపిలోని చిత్తూరులోని ఎగువరేగడకు తరలించి, ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ద్వారకనాథరెడ్డి సాయితేజ కుంటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయితేజ విధుల్లోనే ఉండి వీరమరణం పొందాడని, మనతెలుగు జాతికే గర్వకారణమని పేర్కొన్నారు. సాయితేజ కుటుంబాన్ని ఆదుకుంటామని, చిన్నారుల భవిష్యత్ గురించి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.