AP: బావిలో పడి తల్లీ, బిడ్డలు మృతి

కడప(CLiC2NEWS): ఓ మహిళ తన ఇద్దరు కుమారులతో కలసి బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. చిన్నమండెం మండలం మల్లూరు గ్రామం వద్ద ఇద్దరు కుమారులను దిగుడు బావిలోకి తోసి, అనంతరం తల్లి కూడా బావి లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. గ్రామస్థులు ముగ్గురి మృతదేహాలను బావినుంచి బయటకు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.