తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులూ ముసురే!

హైదరాబాద్ (CLiC2NEWS): పశ్చిమ, మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తో తెలుగురాష్ట్రాల్లో మూడ్రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ తెలిపింది.
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఇవాళ (ఆదివారం)భారీ వర్షం కురిసింది. గంటకు పైగా నగరంలో కుండపోతగా భారీ వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బి, హైదర్‌నగర్, అల్విన్ కాలనీ, నిజాంపేట్, ప్రగతినగర్ కాలనీ, బాచుపల్లి, బాలానగర్, చింతల్, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, కొంపల్లి, మాదాపూర్, మణికొండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తో పాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది.