AP: గన్నవరం విమానాశ్రయంలో నిలిచిపోయిన విమానం
విజయవాడ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయంలో సాంకేతిక లోపం వలన ఎయిరిండియా విమానం నిలిచిపోయింది. ఈ విమానం గన్నవరం నుండి ఢిల్లీకి వెళ్లవలసి ఉంది. దీనిలో 177 మంది ప్రయాణీకులు ఉన్నారు. సాంకేతిక లోపం కారణంగా విమానం రన్‌వేపైనే నిలిపివేశారు. ఎయిరిండియా సిబ్బంది ప్రయాణికులను తిరిగి లాంజ్‌లోకి తరలించారు. సిబ్బంది విమాన సాంకేతిక లోపాన్ని సరిచేస్తున్నారు.