17 ఏళ్లకే ఓటర్ కార్డుకు దరఖాస్తు.. కేంద్ర ఎన్నికల సంఘం

ఢిల్లీ (CLiC2NEWS): ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఉన్న కనీస వయసుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుండి 17 ఏళ్ల వయసు పైబడిన పౌరులు ఓటరు కార్డు కోసం ముందస్తుగానే దరఖాస్తు చేసుకొనేందుకు వీలు కల్పించింది. ఇప్పటి వరకు జనవరి 1నాటికి 18 ఏళ్లు నిండిన వారకే ఓటరు జాబితాలో నమోదుకు అర్హులు.. కానీ తాజా నిర్ణయంతో 17 ఏళ్ల వయసు వారందరికీ అవకాశం లభించింది. ఓటరు జాబితాలో యువత పేర్ల నమోదుకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్‌తో పాటు ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్రపాండే ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. మరోవైపు ఆధార్ సంఖ్యతో ఓటరు కార్డుల అనుసంధాన ప్రక్రియను ఆగస్టు 1 నుండి ప్రారంభించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది.
Super sir