భార‌త్ డైన‌మిక్స్ లిమిటెడ్‌, హైద‌రాబాద్‌లో అప్రెంటిస్ ఖాళీలు..

BDL:  భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన  భార‌త్ డైన‌మిక్స్ లిమిటెడ్ (BDL) హైద‌రాబాద్, కంచ‌న్‌బాగ్ యూనిట్ నందు 75 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. వీటిని భ‌ర్తీ చేసేందుకు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. వ‌చ్చే నెల 5వ తేదీ వ‌ర‌కు అన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు రుసుం లేదు.

ఎల‌క్ట్రానిక్స్‌, మెకానిక‌ల్ , ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్, సివిల్ ఇంజినీరింగ్‌, డిసిసిపి, విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 38,, అండ్ డిప్లొమా అప్రెంటిస్ 37 ఖాళీలు క‌ల‌వు.

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ల‌కు బిఇ/ బిటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. వీరికి రూ.9వేలు స్టైపెండ్ అందుతుంది.

డిప్లొమా అప్రెంటిస్ ల‌కు డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. వీరికి రూ.8వేలు స్టైపెండ్ అందుతుంది.

Leave A Reply

Your email address will not be published.