APSRTC: సంక్రాంతికి 1266 ప్రత్యేక బస్సులు

అమరావతి (CLiC2NEWS): సంక్రాంతి పండుగకు ఎపిఎస్ఆర్‌టిసి 1266 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. పండుగ ప్రయాణికుల కోసం ఎపిఎస్ఆర్‌టిసి జనవరి 7వ తేదీనుండి 17వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నది. విజయవాడ నుండి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు బస్సులు నడుస్తాయని ఆర్టిసి అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్టు వెల్లడించారు. ప్రత్యేక బస్సుల్లో రిజర్వేషన్ అవకాశం కల్పించారు. ప్రయాణికులు ఎపిఎస్ఆర్‌టిసి వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోగలరని అధికారులు తెలియజేశారు.