రేపు ‘ఆరాంఘర్-జూపార్క్’ ఫ్లైఓవర్ ఓపెనింగ్..
హైదరాబాద్ (CLiC2NEWS): సుమారు రూ. 800 కోట్లతో నిర్మించిన ఆరాంఘర్-జూపార్క్ ప్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ కష్టాలను దృష్టిలో పెట్టుకుని జిహెచ్ఎంసి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆరాంఘర్-జూపార్క్ పైవంతెన ఒకటి. ఇది నగరంలో రెండో అతిపెద్ద వంతెన. దీని పొడవు 4.08 కిలోమీటర్లు. ఈ వంతెనను దాదాపు రూ.800 కోట్లతో నిర్మించారు. బెంగళూరు హైవేకు ఉన్న ట్రాఫిక్ రద్దీని ఈ ఫ్లైఓవర్ తో నివారించేందుకు ఈ నిర్మాణం చేపట్టారు. ఈ వంతెనను సిఎం రేవంత్‌రెడ్డి రేపు సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు.