రంగారెడ్డి జిల్లా కోర్టులో మహిళా జడ్జిపై ఖైది దాడి..!
![](https://clic2news.com/wp-content/uploads/2025/02/RANGA-REDDY.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): రంగారెడ్డి జిల్లా కోర్టులో దుశ్చర్య చోటుచేసుకుంది. కోర్టు విచారణ సమయంలో ఓ ఖైది జడ్జిపైకి చెప్పు విసిరాడు. దీంతో ఆగ్రహానికి గురైన న్యావవాదులు నిందితుడికి దేహశుద్ధి చేశారు. నగరంలోని ఎల్‌బినగర్ కోర్టు హాలుతో హత్య కేసు విచారణ జరుగుతుండగా గురువారం మహిళా జడ్జిపై ఖైదీ దాడి చేశాడు. అత్తాపూర్ సిఖ్ విలేజ్‌కు చెందిన కరణ్ సింగ్ అలియాస్ సర్దార్ చీమకొర్తి చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. 2023 జనవరి 5న నార్సింగి పిఎస్ పరధిలో ఓఆర్ ఆర్ సమీపంలో దారి దోపిడి చేసి.. ఒకరిని కత్తితో పొడిచి హత్య చేశాడు. పారిపోయి జగద్గిరి గుట్టలో తల దాచుకున్న అతనిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడి చేశాడు. పోలీసులు ఫిర్యాదుతో అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
పోలీసులపై హత్యాయత్నం కేసులో రంగారెడ్డి కోర్టులో బుధవారం కరణ్ సింగ్‌కు మహిళా జడ్జి జీవిత ఖైదు విధించారు. నార్సింగి హత్య కేసుకు సంబంధించిన విచారణ నిమిత్తం గురువారం మళ్లీ కోర్టులో హాజరుపరిచారు. జైలులో తనకు ఎదురవుతున్న ఇబ్బందులను చెప్పుకుంటానని జడ్జిని నిందితుడు కోరగా.. ఆమె అంగీకరించారు. ఎస్కార్ట్ పోలీసులు ఖైదీని జడ్జి సమీపంలోకి తీసుకెళ్లురు. దగ్గరికి వస్తూనే చెప్పును తీసి జడ్జిపైకి విసిరాడు. జడ్జిని, ఆమె కుటుంబం అంతూ చూస్తానంటూ బెదిరించాడు. అనూహ్య పరిణామంతో షాక్‌కు గురైన న్యాయమూర్తి నిశ్చేస్టులై నిల్చున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఖైదీని పక్క గదిలోకి తీసుకువెళ్లారు. దీంతో ఆవేశానికి గురైన న్యాయవాదులు నిందితుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన గురించి మహిళా జడ్జి.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. శశిధర్‌రెడ్డికి వివరించారు. కరణ్‌సింగ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.