సిఎంకు ఆటో డ్రైవ‌ర్ ఆహ్వానం..

చండీగ‌ఢ్‌(CLiC2NEWS): ఢిల్లి ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్‌  లూధియానాలోని ఓ ఆటో డ్రైవ‌ర్ ఇంటిలో భోజ‌నం చేసి అత‌నిని సంతోష‌పెట్టారు. పంజాబ్‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఢిల్లీ సిఎం లూధియానాలో ప‌ర్య‌టించారు.అక్క‌డ స్థ‌నిక ఆటోడ్రైవ‌ర్ల‌తో స‌మావేశ‌మై వారితో కాసేపు మాట్లాడారు. ఈ సంద‌ర్భంలో అటోడ్రైవ‌ర్లలో ఒక‌రు సిఎం గారిని ఇంటికి భోజ‌నానికి రమ్మ‌ని కోరాడు. దీంతో కేజ్రివాల్‌ స్పందిస్తూ త‌ప్ప‌కుండా వ‌స్తాను ఈరాత్రికి ఓకేనా ? అని అన్నారు. దానికి ఆ ఆటో డ్రైవ‌ర్ ఎంత‌గానో సంతోష‌ప‌డిపోయాడు. స‌మావేశం పూర్త‌యిన త‌ర్వాత సిఎం అటోడ్రైవ‌ర్ ఇంటికి అత‌ని ఆటోలోనే వెళ్లారు. సిఎం త‌న‌తో పాటు భ‌‌గ‌వంత్‌మ‌న్‌, హ‌ర్పాల్ సింగ్ ను కూడా వెళ్లారు. అత‌ని ఇంట్లో నేల‌పై కూర్చుని భోజ‌నం చేశారు. అటోడ్రైవ‌ర్ కుటుంబాన్ని ఢిల్లీలోని త‌న నివాసంకు రావాల‌ని సిఎం ఆహ్వానించారు.

Leave A Reply

Your email address will not be published.