రంజాన్ ఉపవాసులకు మజ్జిగ అమృతం లాంటిది.
రంజాన్ ఉపవాస ప్రియులకు మరియు లావుగా వున్న వారికీ మరియు ఎండాకాలంలో ఎండ తీవ్రతను శరీరం తట్టుకోవటానికి మజ్జిగ ఒక ఔషాదం లాగా అమృతం లాగా పనిచేస్తుంది.
ఫ్రెండ్స్ మజ్జిగ గురించి తెలుసుకుందాం
మజ్జిగ ని సంస్కృతంలో తక్రం అంటారు. హిందీలో ఛాచ్, అని అంటారు. ఇంగ్లీషులో బట్టర్ మిల్క్ అని అంటారు.
స్వర్గంలో దేవతలకు అమృతం ఎలా సుఖాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తుందో ఈ భూమి యందు మానవులకు మజ్జిగ అలాంటి సుఖాన్ని కలిగిస్తుంది.యే వ్యక్తి అయినా సరే కస్టపడి పనిచేసే తత్వం ఉంటే వారు బలంగా ఉండటానికి మగవాళ్ళు మజ్జిగను లస్సి రూపంలో ఒక గ్లాస్ మజ్జిగ తాగితే శ్రమను తట్టుకునే శక్తి వస్తుంది.
మజ్జిగలో కొవ్వు, ప్రోటీన్లు, లాక్టోజ్, షుగర్, కాల్షియం, ఫోస్పోరస్, సోడియం, సాలిడ్స్ ఉంటాయి.
పెరుగునకు నాలుగు భాగాలు నీరు కలిపి దానిని చిలికి త్రాగు దానిని మజ్జిగ అంటారు. మజ్జిగ కాషాయ, ఆమ్ల, మధుర, రసములు కలిగి మధుర విపాకములు కలిగి ఉండును. ఇది అగ్ని దీప్తి కలిగిస్తుంది. ఇది వాతకాపహరలను లఘుగుణం కలిగి ఉంటుంది. మజ్జిగ నిరంతరం సేవించే వారికీ ఇలాంటి వ్యాధులు కూడా త్వరగా రావు.
ఆరోగ్యం కోసం, రోగం రాకుండా ఉండేందుకు మార్కెట్లో డైరీ రూపంలో పాల ద్వారా తయారు అయ్యే వస్తువులు చాలా దొరుకుతున్నాయి. మజ్జిగ ఎండాకాలంలో తాగితే డి హైడ్రెషన్ నుండి తప్పించుకోవచ్చును. ఎండ దెబ్బ నుండి కాపాడి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది మరియు దీనిలో ఫైబర్, కాల్షియం, విటమిన్ బి 12 ఇవన్నీ పోషకతత్వాలు కలిగి ఉంటుంది. కడుపు ఆరోగ్యంగా వుండటానికి, మరియు ప్రేవులు బలంగా ఉండటానికి మరియు గ్యాస్, ఏసీడీటీ, రాకుండా ఉండటానికి చక్కగా పనిచేస్తుంది.
తాజా అధ్యాయనం ప్రకారం బీపీ ని తగ్గిస్తుంది. ఎముకల వ్యాధిని తగ్గిస్తుంది.
మజ్జిగ తాగటం వలన వేడి వలన అయ్యే నిర్జలికరణ నుండి నయం చేస్తుంది. మజ్జిగలో ఎలక్ట్రోలైట్స్ మరియు పోటాషియం,ఉంటాయి. దీనిని సేవించటం విశేషకరమైన లాభాకారిగా ఉంటుంది. మజ్జిగ తాగితే ఎండ తీవ్రత తట్టుకొని శరీరంలో నీటి శాతాన్ని సమమముగా ఉంచుతుంది.
ఎముకలకు
మజ్జిగలో కాల్షియం, ఫోస్పోరస్, మరియు దీనిలో విటమిన్ D కూడా ఉంటుంది.ఇవన్నియు ఎముకలు బలంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఎముకలు ఆరోగ్యవంతంగా, పుష్టిగా, తయారు అవుతాయి. Osteoporosis జబ్బులు చక్కగా తగ్గిస్తుంది.
కోలేష్ట్రాల్ ని కంట్రోల్ చేస్తూ లావు తగ్గిస్తుంది
మజ్జిగ నియమిత రూపంలో తాగితే పెరిగిన వేస్ట్ కోలేస్ట్రాల్ వలన వచ్చే గుండె జబ్బులను మాటుమయం చేస్తుంది. వేస్ట్ కోలేస్ట్రాల్ ని తగ్గిస్తుంది.
special చిట్కా: ఉపవాసంలో వున్న వారికీ, రాత్రి పడుకునే ముందు పలుచటి ఒక గ్లాస్ మజ్జిగలో చిటికెడు ఉప్పు వేసి తాగండి. శరీరంలో చక్కని మార్పు వస్తుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఖాళీ కడుపుతో వున్న ఎటువంటి పరిస్థితిలో శరీరం బలహీనం కాదు. ఉపవాసంలో వున్నవారికి శరీరంలో నీటి శాతం తగ్గితే దానిని రికవరీ మజ్జిగ చేస్తుంది. దయచేసి రాత్రి మజ్జిగలో షుగర్ వేసి తాగరాదు. దీని వలన కఫమ్ వస్తుంది. రాత్రి మజ్జిగలో ఉప్పు వేసి తాగాలి. ఉదయం వీలును బట్టి లస్సి షుగర్ తో తాగవచ్చును. బీపీ ఉంటే పలుచటి మజ్జిగలో పుదీనా నాలుగు ఆకులు కలిపి తాగండి.
బరువు తగ్గాలనుకొనేవారికి special చిట్కా..
మధ్యాహ్నం భోజనం లిమిటెడ్ గా తిని వెంటనే ఒక గ్లాస్ మజ్జిగలో చిటికెడు ఉప్పు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కలిపి తాగండి. మరియు రాత్రి కూడా అలానే మినిమం 8 వారాలు చేయండి. చక్కగా బరువు తగ్గుతారు. పెరుగు అన్నం, చెత్త ఫుడ్ తినవద్దు. వీలుంటే ప్రతిరోజు 3 కిలోమీటర్స్ నడవండి.
- అతిసారం, అమీబియాసిస్ రోగులకు మజ్జిగ చాలా మంచిది.
- జిగురు విరోచనాలకు శొంఠి, మిరియాలు, వాము సమంగా కలిపి మజ్జిగలో వేసుకొని తాగితే విరోచనాలు తగ్గుతాయి.
- మజ్జిగ తాగటం వలన కడుపు చల్లగా ఉంటుంది. అరుచిని, వాపును, ఉదరరోగాలు,అర్షమొలలు, గుల్మలు, గ్రహాణి, మూత్రకచ్చ రోగాలకు హితంగా ఉంటుంది. రక్తహీనత యందు ఉపయుక్తంగా ఉంటుంది.
హెచ్చరిక
ఇది గేద మజ్జిగ తాగేవారికి మాత్రమే వర్తిస్తుంది. మిగతావారికి పనిచేయవు.
మజ్జిగ సైడ్ ఎఫెక్ట్స్:
మజ్జిగ లో సోడియం ఎక్కువగా ఉంటుంది. కనుక పరిమితంగా తాగాలి. లేకపోతే రక్తపోటు పెరుగుతుంది. మితంగా తాగితే రక్తపోటు తగ్గిస్తుంది. మజ్జిగలో లాక్టోజ్ ఉంటుంది. మజ్జిగ ఎక్కువగా తాగితే కడుపుబ్బరం, వాంతులు, విరోచానలు, గ్యాస్ జబ్బులు వస్తాయి.
-షేక్.బహర్ అలీ
యోగచార్యుడు