తెలుగు రాష్ట్రాలకు బాలకృష్ణ భారీ విరాళం

హైదరాబాద్ (CLiC2NEWS): తెలుగు రాష్ట్రాలల్లో వరద బాధితులను ఆదుకొనేందుకు సినీ , రాజకీయ ప్రముఖలు విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్‌టిఆర్ రెండు రాష్ట్రాల సిఎం సహాయ నిధికి రూ. కోటి విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో బాలకృష్ణ కూడా రెండు రాష్ట్రాలకు కలిపి రూ. కోటి విరాళం ప్రకటించారు. తెలుగు నేలను వరద ముంచెత్తుతోందని.. ఈ విపత్కర పరిస్థితుల్లో బాధిత ప్రజల సహాయార్థం ఎపి, తెలంగాణ సిఎం సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున విరాళం అందిస్తున్నానన్నారు. రెండు రాష్ట్రాలు మళ్లీ సాధారణ స్థితికి రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.