వైభవంగా బల్కంపేట అమ్మవారి కల్యాణ మహోత్సవం
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని బల్కంపేట అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి కల్యాణ మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.