Beast: ‘అరబిక్ కుతు’ సాంగ్ తెలుగు వెర్షన్..

విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం బీస్ట్. ఈ చిత్రం ఏప్రిల్ 13 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రంలోని ‘అరబిక్ కుతు’ ‘హలమితి హబీబో..’ సాంగ్‌ను తెలుగులో విడుదల చేశారు. దీనికి శ్రీ సాయికిరణ్ సాహిత్యం అందించగా.. అనిరుధ్, జోనితా గాంధీ ఆలపించారు. అనిరుధ్ స్వరాలు సమకూర్చారు. ఈ పాట తమిళ వెర్షన్ ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలై 260 మిలియన్లకు పైగా వీక్షణలు సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది. ఈ పాటకు సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు.