దేశ రాజధాని ఢిల్లీలో బిజెపి విజయం
బిజెపి 48 స్థానాలు కైవసం..
![](https://clic2news.com/wp-content/uploads/2023/03/BJP.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజధాని ఢిల్లీలో బిజెపి విజయం సాధించింది. ఢిల్లీ ప్రజలు ప్రధాని మోడీ ఇచ్చిన హామీలపై నమ్మకం ఉంచారు. శనివారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టి 22 స్థానాలకు పరమితం కాగా.. కమలదళం మ్యాజిక్ ఫిగర్ (36)ను దాటి 48 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ కనీసం ఒక్క స్తానంలో కూడా ఆధిక్యం సాధించలేదు.
ఆప్ అధినేత కేజ్రివాల్ తో సహా పలువురు కీలక నేతలు సైతం ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. బిజెపి అఓభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో 4 వేలకు పైగా ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఢిల్లీ సిఎం ఆతిశీ.. బిజెపి ప్రత్యర్థి రమేశ్ బిధూరిపై 3,521 ఓట్ల తేడాతో గెలుపోందారు.