ఆర్టీసీ డిపోల్లో రక్తదాన శిబిరాలు

హైదరాబాద్(CLiC2NEWS): ఆర్టీసీ సిబ్బంది రక్తదానం చేసి ఇతరులను ఆదుకోవాలని ఆర్టీసీ ఎండి సజ్జనార్ పిలుపునిచ్చారు. ఆర్టీసీ యాజమాన్యం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి సంయుక్త భాగస్వామ్మంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో మెగా రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కరోనా ప్రభావంతో రక్తం కొరత ఏర్పడడంతో చాలా మంది ఇబ్బంది పడినట్టు చెప్పారు. క్యాన్సర్ రోగులకు, గర్భిణులకు రక్తం చాలా అవసరం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ రక్తదానం కార్యక్రమంలో ప్రజలు, ఆర్టిసి సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేయాలని కోరారు.