Secunderabad: సిఆర్‌పిఎఫ్ పాఠశాల వద్ద బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

సికింద్రాబాద్ (CLiC2NEWS): దేశంలోని సిఆర్‌పిఎఫ్ పాఠశాలలకు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్ జవహర్ నగర్ పరిధిలోని సిఆర్‌పిఎఫ్ పాఠశాల వద్ద బాంబ్ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పాఠశాలలో క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠశాలలోని విద్యార్థులను యాజమాన్యం వారి వారి ఇళ్లకు క్షేమంగా పంపించివేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న రాచకొండ సిపి సుధీర్ బాబు, కుషాయిగూడ ఎసిబి మహేశ్ చేరుకుని పరిస్తితిని పరిశీలించారు.