లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న బిఆర్ఎస్, బిఎస్‌పి

హైదరాబాద్ (CLiC2NEWS): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీచేస్తామని బిఆర్ అధినేత కెసిఆర్, బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. మంగళవారం కెసిఆర్ నివాసంలో ప్రవీణ్ కుమార్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఇరువురు తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. అనంతరం ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. బిఎస్‌పితో గౌరవప్రదమైన పొత్తు ఉంటుందని.. త్వరాలో విధివిధానాలు వెల్లడిస్తామని కెసిఆర్ వెల్లడించారు.