గురుకుల టిజిటి పోస్టులకు బిటెక్ అభ్యర్థులూ ఆర్హులే: హైకోర్టు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలోని టిజిటి పోస్టులకు బిఈడి పూర్తి చేసిన బిటిక్ అభ్యర్థులు అర్హులేనని ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. హైకోర్టులో గురుకులాల టిజిటి పోస్టులకు బిటెక్ అభ్యర్థుల అర్హత విషయంపై విచారణ జరిగింది. వాదనల అనంతరం బిఈడి పూర్తి చేసిన బిటిక్ అభ్యర్థలు టిజిటి పోస్టులకు అర్హులని తీర్పునిచ్చింది. గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు అప్పీళ్లను కొట్టివేసింది. బిఈడి చేసిన బిటెక్ అభ్యర్థులను పరగణనలోకి తీసుకొని నాలుగు వారాల్లో నియామకాలు చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది