పాకిస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 17 మంది సజీవదహనం..!
మృతులందరూ వరద బాధితులే

కరాచీ (CLiC2NEWS): పాకిస్థాన్‌లోని కరాచీకి సమీపంలో బస్సులో మంటలు వ్యాపించి దాదాపు 17 మంది సజీవదహనమయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా పాకిస్థాన్‌లో వరద బాధితులేనని సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా వరద ముంచెత్తిన సమయంలో వారికి మోటార్ వే సమీపంలో ఆశ్రయం పొందారు. తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లే క్రమంలో.. వారు ప్రయాణిస్తున్న బస్సుకు మంటలు అంటుకుని వేగంగా వ్యాపించాయి. దీంతో 17 మంది సజీవదహనమయ్యారు. మరి కొంత మంది బస్సు నుండి బయటకు దూకేశారని పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.