బస్సు, కారు ఢీ- ఐదుగురు సజీవదహనం

రామ్‌గఢ్ (CLiC2NEWS): జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో బుధవారం ఉదయం ఓ కారు బస్సు ఢీకొట్టడం వల్ల ఐదుగురు దుర్మరణం చెందారు. రాజరప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని మురబండ వద్ద ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడటంతో పోలీసులు ఆసుప‌త్రికి త‌ర‌లించామ‌ని వారు తెలిపారు.

రామ్‌గఢ్-గోలా ప్రధాన రహదారిపై ఉదయం 8 గంటల సమయంలో వ్యాగన‌ర్ కారు బస్సును ఢీకొట్టిందని పోలీసు సూపరింటెండెంట్ ప్రభాత్ కుమార్ తెలిపారు. ఢీకొన్న వెంటనే కారులో మంటలు చెలరేగి ఐదుగురు మరణించినట్లు ఆయన తెలిపారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే మొద‌ట కారులో మంటలు తలెత్తాయి. అనంతరం బస్సుకూ మంటలు వ్యాపించాయి. దీంతో ఐదుగురు ప్రయాణికులు స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. బస్సులో నుంచి భారీగా మంట‌లు ఎగ‌సిప‌డ్డాయి. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఓ టీనేజీ అబ్బాయి ఉన్నారని పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు చెప్పారు. బాధితులు పట్నాకు చెందినవారని పోలీసులు గుర్తించారు. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

1 Comment
  1. SEO says

    Wow, wonderful blog layout! How long have you been blogging for? you made blogging look easy. The full glance of your site is excellent, as neatly as the content material!!

Leave A Reply

Your email address will not be published.