గంజాయి సేవిస్తుండగా.. రైలు ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృతి

పీలేరు (CLiC2NEWS): పట్టాలపై కూర్చుని గంజాయి తీసుకుంటున్న విద్యార్థులను రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లీ పీలేరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..ఇంటర్ సెకండియర్ చదివే విద్యార్థులు మంగళవారం రాత్రి చిత్తూరు మార్గంలోని రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి గంజాయి తీసుకుంటున్నారు. అదే సమయంలో నాగర్‌కోయిల్ నుండి ముంబయి వెళ్లే రైలు వీరిపై నుండి దూసుకెళ్లింది. గంజాయి మత్తులో రైలు వస్తున్న విషయాన్ని కూడా వారు గమనించలేకపోయారు. ఇద్దరూ గంజాయికి అలవాటు పడ్డారని, వారి వద్ద గంజాయి పొట్లాలు లభించాయని పోలీసులు తెలిపారు.