కర్నూలు జిల్లాలో బావిలోకి దూసుకెళ్లిన కారు

కర్నూలు (CLiC2NEWS): కర్నూలు నుండి ఎమ్మిగూరు వెళ్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గరైంది. జిల్లాలోని ఎమ్మిగూరు మండల ఎర్రకోట వద్ద కారు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లింది. బావిలో నీరు ఎక్కవగా ఉండడం వలన కారు నీటిలో మునిగిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.