లారీ కిందకు దూసుకెళ్లిన కారు: ముగ్గురు మృతి

కర్నూలు (CLiC2NEWS): జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీ కిందకు కారు దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షత గాత్రులను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ధర్మవరానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు కర్నూలుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.