ఘనంగా సిఎం జగన్ జన్మదిన వేడుకలు..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా పార్టి నేతలు, కార్యకర్తలు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సిఎం జగన్ కేక్ కట్ చేసి, వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రలు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్, సిఎస్ సమీర్ శర్మ, ఎంపిలు వేమిరెడ్డి, బాలశౌరి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు సిఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.