బిపిన్ రావత్ పార్థివదేహానికి ప్రముఖుల నివాళి

చెన్నై(CLiC2NEWS): హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన బిపిన్ రావత్ పార్థివదేహానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తమిళనాడు సిఎం స్టాలిన్ నివాళులర్పించారు. తమిళనాడులోని వెల్లింగ్టన్లోని మద్రాసు రెజిమెంటల్ సెంటర్లో ఉన్న రావత్ భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. ప్రమాదంలో మృతి చెందిన ఆర్మీ సిబ్బందికి కూడా నివాళులర్పించారు. మద్రాస్ రెజిమెంట్ సెంటర్లో రావత్ సహా 13 మంది సిబ్బంది భౌతికకాయాలను ఉంచారు.