చంద్రబాబుకు కేంద్ర సర్కార్ ఆహ్వానం

అమరావతి (CLiC2NEWS): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కేంద్ర సర్కార్ ఆహ్వానం అందింది. `అజాదీ కా అమృత్ మహోత్సవ్` జాతీయ కమిటీ సమావేశంలో పాల్గొనాల్సిందిగా కేంద్ర సర్కార్ చంద్రబాబును కోరింది. ఢిల్లీలో ఆగస్టు 6వ తేదీన ఆయన వెళ్లనున్నారు. ఈ రాష్ట్రపతి భవన్‌లో జరుగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించనున్నారు.