ఒలింపిక్స్ లో భారత్ బోణీ

టోక్యో(CLiC2NEWS): ఒలింపిక్స్‌లో భారత్ బోణీ కొట్టింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం దక్కింది. మహిళల 49 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టల్ మీరాబాయి చాను రజతం గెల్చుకుంది. ఇక, ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో కరణ మల్లీశ్వరి పతకం గెలిచిన తర్వాత మీరాబాయి చాను పతకం సాధించారు.
స్నాచ్‌లో 87 కిలోలు ఎత్తిన ఆమె క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోలు ఎత్తింది. మొత్తంగా 202 కిలోలు ఎత్తి భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది.
మోదీ ప్రశంస..ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన మీరాబాయి చానును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ప్రధాని.. ఆమె విజయం భారత ప్రజలందరిలో స్ఫూర్తి నింపుతుందని అన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు గొప్ప శుభారంభం దక్కిందని కొనియాడారు.
మీరాబాయికి ప్రశంసల వర్షం
టోక్యో ఒలిపింక్స్‌లో వెండి పతకంతో మెరిసిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు.. పలువురు క్రీడా ప్రముఖులు అభినందనలు తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి భారత పతకాల పట్టికను తెరిచిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుకు హృదయపూర్వక అభినందనలు.
– రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను అద్భుతమైన ప్రదర్శనతో యావత్ భారతం ఉప్పొంగిపోతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన ఆమెకు అభినందనలు. ఆమె విజయం ప్రతి భారతీయుడికి స్ఫూర్తి దాయకం.
– ప్రధాని మోడీ
ఒలింపిక్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను రజత పతకం సాధించడం గర్వంగా ఉంది. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలి.
– కేంద్రమంత్రి అమిత్ షా
టోక్యోలో భారత్ తొలి పతకం నమోదు చేసింది. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజత పతకం అందుకుంది. యావత్ భారతావని గర్వపడే విషయం. అభినందనలు చాను.
– కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
ఎంత మంచి రోజు! భారత్‌కు ఎంత మంచి విజయం. 49 కిలోల విభాగంలో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజతాన్ని ముద్దాడింది. దీంతో భారత పతకాల పట్టిక మొదలైంది. యావత్ దేశాన్ని గర్వపడేలా చేశావు చాను.
– మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్