మండపేటలో మెగా రక్తదాన శిబిరం..

మండపేట (CLiC2NEWS): ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ జ‌న్మ‌దిన వేడుక‌లు సంధ‌ర్భంగా మండపేట‌లో మెగా ర‌క్త‌దాన శిబిరం ఏర్పాటుచేశారు. సంక్షేమమే ధ్యేయంగా.. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేషంగా పాటుపడుతున్న యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మండపేటలో అంబరాన్నంటాయి. వైఎస్సార్సీపీ యువనేత, శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు తనయుడు తోట పృథ్వీరాజ్ నేతృత్వంలో నిర్వహించిన వైఎస్ జగన్ 49వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మండపేటలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
నియోజక వర్గంలోని 42గ్రామల నుంచి అభిమానులు అశేషంగా తరలివచ్చి రక్తదానం చేశారు. మండపేట మున్సిపల్ కౌన్సిలర్ లు సైతం మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. స్థానిక సూర్యా కన్వెన్షన్ హాల్ లో మంగళవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ తదితర నాయకులతో కలిసి తోట త్రిమూర్తులు కేక్ కట్ చేసి సీఎం వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రక్తదానంలో పాల్గొన్న యువతీ యువకులను పేరు పేరునా తోట పలకరించి వారిని అభినందించారు. రక్త దాతలకు ఆయన చేతుల మీదుగా ఆక్సిజన్ మొక్కను బహూకరించారు. మొత్తం మీద వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు మండపేట అసెంబ్లీ నియోజక వర్గంలో గ్రామ గ్రామాన వైభవంగా జరిగాయి.
కార్యక్రమ నిర్వాహకులు వైఎస్సార్ రాష్ట్ర యువనేత తోట పృథ్వీరాజ్, మరో యువనేత చోడే శ్రీకృష్ణతో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్తూ దేశంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా పేరుగాంచిన డైనమిక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నేడు రాష్ట్రంలో వాడవాడలా గ్రామ గ్రామాన జరుగుతున్నాయన్నారు. యువకులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశాజ్యోతి అని, మార్గదర్శి అని ప్రశంసించారు. మండపేటలో పెద్ద ఎత్తున నిర్వహించిన రక్తదాన శిబిరానికి తరలి వచ్చిన యువతీ యువకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛందంగా వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ హేమలత ఆసుపత్రి సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రక్తదానం చేయడానికి తరలివచ్చిన యువతీ యువకుల ఆరోగ్యాన్ని పరీక్షించి రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు చోడే సత్యకృష్ణ, టౌన్ కన్వీనర్ ముమ్మిడివరపు బాపిరాజు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ లు మీగడ శ్రీనివాస్, షేక్ అలీఖాన్ బాబా, మున్సిపల్ వైస్ చైర్మన్ వేగుళ్ల నారాయణరావు, కౌన్సిలర్స్ పోతంశెట్టి ప్రసాద్, చిట్టూరి సతీష్, ఎర్నేని ప్రభావతి, కొవ్వాడ బేబీ, బొక్కా సరస్వతి, నీలం దుర్గమ్మ, మందపల్లి రవి కుమార్, మొండి భవాని మురళీ, శెట్టి కళ్యాణి, మెండు బాపిరాజు, ఏడిద సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం, కొమ్ము రాంబాబు, పతివాడ రమణ, పడాల సతీష్, వైవీఎస్ శ్రీదేవి, పలివెల సుధాకర్, రామిశెట్టి శ్రీహరి, శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు పెంకే గంగాధర్, సొసైటీ ప్రెసిడెంట్ కుక్కలరామారావు, ముక్కా దాలయ్య, జొన్నపల్లి సత్తిబాబు, బూరిగ జానీ, అధికారి శ్రీనివాస్, సాధనాల శివభగవాన్, శిరంగు శ్రీనివాస్, రూరల్ కన్వీనర్ పిల్లా వీరబాబు, కొడమంచిలి భాస్కరరావు, దూలం చక్రవర్తి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కన్వీనర్, ప్రముఖ న్యాయవాది టివి గోవిందరావు మూడు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.