పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి
ఢిల్లీ (CLiC2NEWS): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారం గురువారం అందుకున్నారు. దేశంలో రెండో అత్యన్నతమైన పద్మ విభూషణ్ పురస్కారంను ప్రముఖ సిని నటుడు చిరంజీవికి ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి చేతుల మీదగా చిరంజీవి పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి సతీమణి, రామ్చరణ్ ఉపాసన హాజరయ్యారు. ఈ ఏడాది మొత్తం 132 పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి.