CJI: ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (IAC) నా కల

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నది తన చిరకాల స్వప్నమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. రాజ్‌భవన్ అతిథి గృహంలో ఎన్‌వీ రమణ మంగళవారం హైకోర్టు లీగల్ రిపోర్టర్లతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. పారిశ్రామిక, ఐటీ, ఇతర అంతర్జాతీయస్థాయి సంస్థల్లో ఏర్పడే వివాదాల పరిష్కారాల కోసం ఆర్బిట్రేషన్ సెంటర్ (మధ్యవర్తిత్వ కేంద్రం)ను హైదరాబాద్‌లో ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. సింగపూర్‌లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ తరహాలోనే హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకోసం ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుందరేశ్ మీనన్‌కు ప్రతిపాదన పంపినట్టు చెప్పారు. హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారని తెలియజేశారు.