ప్రకాశం బ్యారేజిని పరిశీలించిన సిఎం చంద్రబాబు

విజయవాడ (CLiC2NEWS): ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు వరద ముంపు ప్రాంతాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన సోమవారం సాయంత్రం ప్రకాశం బ్యారేజి వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. బ్యారేజి గేట్లను పడవలు ఢీకొట్టడంతో అక్కడ కొన్ని గేట్లకు మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వరదల కారణంగా వరద నీరు ఎక్కువవడంతో ప్రకాశం బ్యారేజి 70 గేట్లను ఎత్తు నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే.