ప‌రిస్థితులు బాగుంటే మిమ్మ‌ల్ని మ‌రింత సంతోష‌పెట్టేవాడిని

ఉద్యోగ సంఘాల‌తో సిఎం జ‌గ‌న్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి ఉద్యోగుల స‌హ‌కారం ఉంటేనే ఏదైనా చేయ‌గ‌లుగుతామ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అన్నారు. చ‌ర్చ‌లు స‌ఫ‌లం కావ‌డంతో ఆదివారం సిఎం జ‌గ‌న్‌తో ఉద్యోగ సంఘాలు ప్ర‌త్యేకంగా భేటీ అయ్యాయి. ఈ సంద‌ర్భంగా సిఎం మాట్లాడారు…

ఉద్యోగులు ఎవ‌రూ భావోద్వేగాల‌కు పొవ‌ద్ద‌ని తెలిపారు. అలాంటి ప‌రిస్థితి ఏదైనా ఉంటే ప్ర‌భుత్వంతో చ‌ర్చించాల‌ని సూచించారు. ఈ ప్ర‌భుత్వం మీది. మీ స‌హ‌కారంతో మంచి చేయ‌గ‌లుగుతున్నాను అని సిఎం తెలిపారు. ఎప్పుడు అయినా మీ స‌మ‌స్య‌లు ప్ర‌భుత్వానికి చెప్పుకోవ‌చ్చ‌ని తెలిపారు. ఈ ప‌రిస్థితులు ఈ మాదిరిగా ఉండ‌క‌పోయి ఉంటే.. మీ అంద‌ర్నీ మ‌రింత సంతోష‌పెట్టేవాడిని అని సిఎం అన్నారు.

“నేను మ‌న‌స్ఫూర్తిగా న‌మ్మే దొక్క‌టే.. మీరు లేక‌పోతే నేను లేను“ అని ఈ సంద‌ర్భంగా సిఎం అన్నారు.

 

ఈ సంద‌ర్భంగా.. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగాలేక‌పోయినా ఇంత మేలు చేసినందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ఉద్యోగ సంఘాల నేత‌లు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.