AP: పివి సింధును అభినందించిన సిఎం జగన్

అమరావతి (CLiC2NEWS) : ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పివి సింధు ఈరోజు కలిశారు. ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధును సిఎం అభినందించి సత్కరించారు. రాష్ట్రం నుంచి మరింత మంది సింధులు తయారు కావాలని ఆయన అన్నారు. సింధుకు అధికారులు ప్రభుత్వం తరుపున రూ. 30 లక్షల నగదును అందజేశారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. మీ ఆశీర్వాదంతో పతకం సాధించానని, వెళ్ళేముందు సిఎం జగన్ ఆశీర్వదించారని, మెడల్ సాధించాలని అన్నారని తెలిపారు. నేషనల్స్‌లో గెలిచిన వారికి వైఎస్సార్ అవార్డులు ఇస్తున్నారని అన్నారు. విశాఖలో అకాడమీని ప్రారంభించేందుకు ప్రభుత్వ స్థలం కేటాయించిందని, త్వరలో అకాడమీని ప్రారంభిస్తానని సింధు తెలిపారు.