‘శతవసంతాల ఘంటసాల’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సిఎం జగన్

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రేగుళ్ల మల్లిఖార్జునరావు రూపొందించిన ‘శతవసంతాల ఘంటసాల’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లిఖార్జునరావు ఘంటసాల వెంకటేశ్వరరావుపై ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఘంటశాల శత జయంతి సందర్భంగా ఈపుస్తకాన్ని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ఘంటసాల జీవిత చరిత్ర, కుటుంబ సభ్యులు, వివిధ రంగాల్లో ప్రముఖులు రాసిన అభిప్రాయాలు, ఘంటసాల చిత్రమాలిక పొందుపరిచారు. ఈకార్యక్రమంలో పర్యాటక, సాస్కృతిక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, స్పెషల్ సిఎస్ రజత్ భార్గవ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లిఖార్జున రావు తదితరులు పాల్గొన్నారు.