బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సిఎం జ‌గ‌న్ దిగ్భ్రాంతి.. రూ.5 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఎపిలోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా, జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సు వాగులో బోల్తా ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంభాల‌కు సిఎం ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ప్ర‌మాదం జ‌రిగిన తీరును అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.
బ‌స్సు ప్ర‌మాద మృతుల కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్ గ్రేషియో ప్ర‌క‌టించారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వ్య‌ద్యం అందించాల‌ని కలెక్ట‌ర్‌కు సూచించారు.

కాగా ఈ ప్ర‌మాదంలో బ‌స్సు డ్రైవ‌ర్ స‌హా 9 మంది మృతిచెందారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రి కొంద‌రు తీవ్రంగా గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను జంగారెడ్డిగూడెంలోని స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స‌నందిస్తున్నారు.

ఆర్టీసి బ‌స్సు ఎదురుగా వ‌స్తున్న వాహ‌నాన్ని త‌ప్పించ‌బోయి జ‌ల్లేరు వాగులో ప‌డిపోయింది. ప్ర‌మాద‌స‌మ‌యంలో బ‌స్సులో 47 మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంలో 9 మంది మృతిచెందిన‌ట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుల్లో మ‌హిళ‌లు, చిన్నారులు ఉన్నారు . ఈ ప్ర‌మాదంలో ప‌లురురికి తీవ్ర తీవ్ర‌ గాయాల‌య్యాయి. ప్ర‌మాద స్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొనసాగుతున్నాయి.

మృతుల్లో ఆర్టీసీ డ్రైవ‌ర్ చిన్నారావు, పొడ‌పాలి దుర్గ (తాడువాయి), కేత వ‌ర‌ల‌క్ష్మి (ఎ.పోల‌వ‌రం), ఎ మ‌ధుబాబు (చిన్నంవారిగూడెం)ను పోలీసులు గుర్తించారు. మిగ‌తా వారి వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి స‌మాచారం తెలియాల్సిఉంది.

Leave A Reply

Your email address will not be published.