ఈ సారి విశాఖలో ప్రమాణస్వీకారం చేస్తానన్న ఎపి సిఎం జగన్

విశాఖ (CLiC2NEWS): చెన్నై, హైదరాబాద్కు ధీటుగా విశాఖను అభివృద్ధి చేస్తామని..నగర అభివృద్ధికి పదేళ్ల ప్రణాళిక ఉందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. విజన్ వైజాగ్ పారిశ్రామికవేత్తల సమావేశంలో సిఎం మాట్లాడుతూ.. ఈసారి ప్రమాణ స్వీకారం ఇక్కడే చేస్తానన్నారు. నగర అభివృద్ధికి ఆచరణాత్యక ప్రణాళిక అవసరమని.. దీనికి కేంద్ర ప్రభుత్వ సహాయం కావాలన్నారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య నమూనా కావాలన్నారు. అదేవిధంగా అమరావతికి నేను వ్యతిరేకినికానని.. శాసన రాజధానిగా అది కొనసాగుతుందన్నారు. అక్కడ 50 వేల ఎకరాల బీడు భూమి తప్ప ఏమీ లేదని.. ఆప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఎకరానికి రూ. 2 కోట్లు ఖర్చవుతుందని సిఎం తెలిపారు.